ఆరోగ్య సాగు — ప్రతిరోజూ

మీ బ్లడ్ టెస్ట్‌తో మొదలయ్యే ఫిట్‌నెస్ కోచింగ్

ఇంట్లోనే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. కోచ్ అరుణ్ తేజ మీ రిపోర్ట్ చదివి, మీ శరీరానికి తగ్గట్టు భారతీయ ఆహార ప్లాన్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ తయారు చేస్తారు — రెడీమేడ్ టెంప్లేట్ కాదు. యాప్‌లో రోజూ ప్లాన్ పాటించండి, హార్వెస్ట్ పాయింట్లు సంపాదించండి, 8 వారాల తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి ఏం మారిందో చూడండి.

బ్లడ్ టెస్ట్‌తోనే ఎందుకు మొదలుపెట్టాలి?

ఒకే లక్ష్యం ఉన్న ఇద్దరికి వేర్వేరు ప్లాన్లు అవసరం కావచ్చు. అద్దంలో కనిపించని విషయాలు — విటమిన్ D లోపం, పెరుగుతున్న షుగర్, ఐరన్ లోపం, థైరాయిడ్ — బ్లడ్ టెస్ట్ చూపిస్తుంది. ఏం తినాలి, ఎంత ట్రైనింగ్ చేయాలి, ముందు ఏది సరిచేయాలి అనేది Fitfarmer ఈ ఫలితాలతోనే నిర్ణయిస్తుంది.

మీ రిపోర్ట్, మీ ప్లాన్

బరువు తగ్గడం, బలం పెంచడం లేదా షుగర్ నియంత్రణ — మీ లక్ష్యం ఏదైనా, ప్లాన్ మీ సొంత రిపోర్ట్ మీదే తయారవుతుంది.

ఇంటి భోజనమే

పప్పు, అన్నం, రొట్టె, పనీర్, గుడ్లు, పెరుగు, కూరలు — శాకాహారులకు, గుడ్లు తినేవారికి, మాంసాహారులకు.

8 వారాల్లో రుజువు

సైకిల్ చివర మళ్ళీ టెస్ట్ ఉంటుంది, కాబట్టి మార్పు అంచనాతో కాదు, అంకెలతో కనిపిస్తుంది.

మీ కోచ్

అరుణ్ తేజ

అరుణ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, మెన్స్ ఫిజీక్ అథ్లెట్. ఆయన కోచింగ్‌లో మూడు విషయాలు కలిసి నడుస్తాయి — వ్యాయామం, పోషణ, సైకాలజీ — ఎందుకంటే మీరు పాటించగలిగినప్పుడే ప్లాన్ పనిచేస్తుంది.

అరుణ్ గురించి మరింత (English)

వైద్య విషయాలపై డాక్టర్ పర్యవేక్షణ

ట్రైనింగ్, ఆహార ప్లాన్ అరుణ్ రాస్తారు. ప్లాన్‌లో ఏదైనా సప్లిమెంట్ ఉన్నా, రిపోర్ట్‌లో డాక్టర్ దృష్టి అవసరమైన అంశం ఉన్నా, పార్టనర్ డాక్టర్ ముందుగా పరిశీలిస్తారు. Fitfarmer వ్యాధి నిర్ధారణ లేదా చికిత్స చేయదు.

మీ ప్రశ్నలు

Fitfarmer అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది?

Fitfarmer భారతదేశం కోసం ఆన్‌లైన్ ఫిట్‌నెస్, డైట్ కోచింగ్ సర్వీస్. ముందు ఇంట్లో బ్లడ్ టెస్ట్ జరుగుతుంది, తర్వాత కోచ్ అరుణ్ తేజ మీ రిపోర్ట్ ఆధారంగా భారతీయ ఆహార, ట్రైనింగ్ ప్లాన్ రాస్తారు, మీరు దాన్ని రోజూ యాప్‌లో పాటిస్తారు. 8 వారాల తర్వాత మళ్ళీ టెస్ట్ ఉంటుంది.

నేను ల్యాబ్‌కి వెళ్ళాలా?

అవసరం లేదు. ల్యాబ్ టెక్నీషియన్ మీ ఇంటికే వచ్చి శాంపిల్ తీసుకుంటారు, రిపోర్ట్ నేరుగా యాప్‌లోకి వస్తుంది. ఏ నగరాల్లో సౌకర్యం ఉంటుందో లాంచ్ సమయంలో చెబుతాం.

ఇది డాక్టర్‌కి బదులుగా పనిచేస్తుందా?

లేదు. Fitfarmer ఫిట్‌నెస్, ఆహార కోచింగ్ మాత్రమే ఇస్తుంది — వ్యాధి నిర్ధారణ, చికిత్స లేదా మందులు కాదు. ఆరోగ్య సమస్యలకు మీ డాక్టర్‌ను సంప్రదించండి.

శాకాహారులకు కూడా ప్లాన్ ఉంటుందా?

ఉంటుంది. ప్లాన్ రోజువారీ భారతీయ ఆహారంతోనే తయారవుతుంది — శాకాహారం, గుడ్లు లేదా మాంసాహారం, సైన్-అప్‌లో మీరు ఎంచుకున్నదాని ప్రకారం.

దీని ధర ఎంత?

ఒక 8 వారాల సైకిల్‌లో బ్లడ్ టెస్ట్, మీ ప్లాన్, యాప్, చెక్-ఇన్లు ఉంటాయి. లాంచ్ ధర ఇంకా ఖరారు కాలేదు — ప్రస్తుత తాత్కాలిక ధర ప్రైసింగ్ పేజీలో చూడండి.